సిరా న్యూస్,కాకినాడ;
ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీనికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం అయ్యారు .ఎన్నికలలో వ్యవహరించాల్సిన వ్యూహం పై చర్చించారు. ఎమ్మెల్సీ, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ సమావేశానికి నేతృత్వం వహించారు .
వాయిస్: గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వామపక్షాలకు చెందిన ఐ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు .అప్పుడు ఆయనకు టిడిపి మద్దతిచ్చింది. ఈసారి ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని యనమల సమావేశం అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి పార్లమెంటుకు త్రీ మెన్ కమిటీని నియమిస్తున్నాము. కూటమి ఎమ్మెల్యేలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.గతం లో 1.93 లక్షల గ్రాడ్యుయేట్లు నమోదయి ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెంచుతామన్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు బాధ్యతలు తీసుకుంటారని వెల్లడించారు .ఆన్లైన్ లేదా డైరెక్ట్ గా తాసిల్దార్ కార్యాలయంలో గ్రాడ్యుయేట్లు తమ దరఖాస్తులు ఇచ్చే విధంగా నాయకులు మోటివేట్ చేస్తారు అన్నారు .ఈ సమావేశానికి రాజమండ్రి పార్లమెంటు పరిధిలో కొందరు ప్రజాప్రతినిధులు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు.