సిరా న్యూస్,హైదరాబాద్;
మూసి ప్రక్షాళన పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేస్తుందని బీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. గతంలో తెలంగాణ భవన్ కి మూసి పరివాహక ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి బాధలు చెప్పుకున్న విషయం తెలిసిందే. బి ఆర్ ఎస్ ఎంఎల్ఏ లు కేటీఆర్, హరీష్ రావు మూసి పరివాహక ప్రాంతలు ఇప్పటికే పర్యటన చేసారు. పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేది లేదు అని తెలిపారు. గతంలో 16వేల కోట్ల మూసి సుందరికరణకు గత ప్రభుత్వం సిద్దమయింది.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష 50 వేల కోట్లకు ఎప్పటికి వెళుతుంది అని నిలదీస్తున్నారు. ఎస్ టి పి ల ను గత ప్రభుత్వం హయంలోనే పూర్తి చేసిందని అంటున్నారు.