సిరా న్యూస్,చెన్నై;
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడును వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నైలోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. స్థానిక సత్య భామ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో మూడు అడుగుల మేర నీరు చేరింది. ఈ క్రమంలో నడుము లోతు నీటిలో విద్యార్థులు తమ బ్యాగులను పట్టుకుని బయటకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.