– వారం రోజులల్లో పెండింగ్ పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పించాలి
– సబ్ సెంటర్ల టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పై స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకున్నాయని, పెండింగ్ ఉన్న చిన్న చిన్న పనులను వారం రోజుల వ్యవధిలో పూర్తి చేసి సంబంధిత బిల్లులు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల మరమ్మత్తు , టాయిలెట్ల నిర్మాణానికి మంజూరు చేసిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పంచాయతీరాజ్ విభాగం ద్వారా చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ధర్మారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభించా మని, వీటిని నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. అదేవిధం గా టెండర్ దశలో ఉన్న 18 సబ్ సెంటర్ల పనులు త్వరగా ప్రారంభించే దిశగా టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని, మంజూరు చేసిన పనులను త్వరగా గ్రౌండ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.