ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించిన పొనగంటి మల్లయ్య…

ఘనంగా మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య జన్మదిన వేడుకలు..
పేదలకు అన్నదానం చేసిన పొనగంటి మల్లయ్య..
సిరా న్యూస్,జమ్మికుంట;
జమ్మికుంట మాజీ సర్పంచ్, కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని జన్మదినానికి పురస్కరించుకొని ఆయన అనుచరులు జమ్మికుంట పట్టణంలోని బొమ్మల గుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ అనేక పదవులను ఆరాధించిన పొనగంటి మల్లయ్య, మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పొనగంటి మల్లయ్య, కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు బొంగోని వీరన్న, దిడ్డి రాము, పొనగంటి సారంగం, కాంగ్రెస్ నాయకులు, పొనగంటి సురేష్ దేశీని సదానందం, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *