ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రైవేట్ కళాశాల అధ్యాపక బృందం…
సిరా న్యూస్,జమ్మికుంట;
తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక బంద్ 3 వ. రోజు కార్యక్రమంలో జమ్మికుంట పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాల డైరెక్టర్ విజేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి, ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో నివసిస్తున్న విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందని ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ పొంది ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వలన తమ యొక్క చదువులను మధ్యలోనే నిలిపి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ తో విద్యను అందిస్తున్న ప్రైవేటు కళాశాలను ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన అప్పులపాలై లెక్చరర్ల జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి ప్రైవేట్ కళాశాలలను ఆదుకొని విద్యార్థుల యొక్క ఉన్నత చదువులకు తోడ్పడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…