సిరా న్యూస్,కసింకోట;
కసింకోట వద్ద జాతీయ రహదారిపై సరోజినీ విల్లా ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు అందించిన వివరంగా ఉన్నాయి. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపుకు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని దారిలో కసింకోట వద్ద వెనకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో నక్కపల్లి మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన కురం దాస్ ప్రతాప్ (30), అదే గ్రామానికి చెందిన బర్నికుల రాజేష్ (25) బైక్ పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు స్నేహితులు. వృత్తిరీత్యా వీరిద్దరూ కార్ డ్రైవర్లు గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఈ మేరకు కసింకోట సిఐ అల్లు స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.