సిరా న్యూస్,అన్నమయ్య;
నిమ్మనపల్లెలో మిస్ అయిన యువకుడు బెంగుళూరులో స్నేహితుని చేతిలో దారుణ హత్యకు గురైయ్యాడు. మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలం, గుండ్లబురుజు దళితవాడకు చెందిన రమణ కొడుకు బాలాజీ (24) పవణ హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డనహళ్లిలో రామసముద్రంకు చెందిన స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో స్నేహితుడే బాలాజినీ దారుణంగా హత్య చేశాడు. గురువారం ఉదయం వెలుగు చూసిన కలకలం రేపుతున్న ఘటన వివరాలను కర్ణాటక బెంగుళూరు, పవణహళ్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సెల్వం తెలిపారు.