సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లాలో.. రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేచ్ఛగా కొనసాగుతుంది. తాజాగా.. పాలకీడు మండలoలోని గుడుగుంట్లపాలెం, మూసివడ్డు సింగారం, ఎల్లాపురం గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లతో పాటు.. రేషన్ బియ్యాన్ని పోలీసుస్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. సివిల్ సప్లై పోలీసులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ని దాడులు చేసినా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.