సిరా న్యూస్, సైదాపూర్:
దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ ల పంపిణీ : డీఎం రవీంద్రనాథ్
సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో ఉడిగె విజయ రాజశేఖర్ ఆధ్వర్యంలో హుజురాబాద్ డీఎం రవీంద్రనాథ్ చేతుల మీదుగా దివ్యాంగులకు ఉచిత బస్ పాస్ లను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. అనంతరం బస్ డిపో మేనేజర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఉచిత బస్ పాస్ లను వినియోగించుకోవాలని, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చునని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగంధర్ రెడ్డి, ఆదిరెడ్డి, బోల్ల హరీష్, జెట్టి కనకయ్య, అంజయ్య, శ్రీనివాస్, రవి, రాజయ్య, రాజనర్సు, ఆర్టీసీ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.