సిరాన్యూస్, చొప్పదండి
నూతన రహదారిపై సర్వే జరిపించాలి : ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకుడు చీకట్ల లక్ష్మయ్య
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
చొప్పదండిలోని దేవాలయాలకు నూతన రహదారిపై సర్వే జరిపించాలని సమ్మక్క సారలమ్మ ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకుడు చీకట్ల లక్ష్మయ్య అన్నారు. ఈసందర్బంగా సోమవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి వినతి పత్రం సమర్పించారు. చొప్పదండిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి హాజరైన కలెక్టర్కి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కాగా దీనిపై స్పందించిన కలెక్టర్ చొప్పదండి తహసిల్దార్ నవీన్ కుమార్కి సర్వే చేసి రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.