పోలీసు అమరవీరులకు శ్రద్దాంజలి

హోం మంత్రి అనిత
సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తదితరులు పాల్గోన్నారు. కార్యక్రమానికి పోలీసు ఉన్నతాధికారులు, పోలీసుల కుటుంబసభ్యులు హజరయక్యారు. ముఖ్యమంత్రి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.
హోం, మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పోలీసు వీరులందరికీ శ్రద్ధాంజలి. అసాంఘిక శక్తులని ఎదిరించి వీరమరణం పొందిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు, ప్రసాద్ బాబు వంటి మహణీయులకు నివాళి . సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నాం. టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం. విజయవాడ కమిషనరేట్ కేంద్రంగా సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చాం. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై సామాన్యులకు తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మాజీ సైనిక కుటుంబాల సంక్షేమం కోసం రూ.10 కోట్లతో సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు.
డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రత్యేక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసాం. గత ప్రభుత్వంలో నిలిచిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం. తుపానులు, వరదలు, దసరా శరన్నవరాత్రులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం. విజయవాడ వరదల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది శభాష్ అనిపించేలా సేవలు. నవతరానికి ఉత్సాహాన్ని స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహణ ఉద్దేశ్యం. డ్రగ్స్ రహిత ఏపీ లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో పాటు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పరిచాం . సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా యువత డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా అవగాహన కల్పిస్తాం, ధైర్యసాహసాలతో తమ ప్రాణత్యాగం చేసేంత తెగువను నేర్పిన తల్లిదండ్రులు, కుటుంబాలకు నా సెల్యూట్ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *