సిరాన్యూస్, సామర్లకోట
బాణాసంచా విక్రయశాలల ఏర్పాటుకు పటిష్టమైన చర్యలు : తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి
దీపావళి మందు గుండు సామాగ్రి విక్రయ షాపుల వద్ద ఎటువంటి అవాంఛన సంఘటనలకు తావు లేకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని సామర్లకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం సామర్లకోట మండల తహసీల్దార్ కార్యాలయంలో బాణసంచా దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ లైసెన్స్ నిబంధనల ప్రకారం భద్రతాపరమైన ప్రమాణాలను పాటించాలన్నారు. మందు గుండు నిల్వ కేంద్రాలు దుకాణాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలపై యజమానులకు సూచనలను సలహాలను ఇచ్చారు. ఎంపిక చేసిన బహిరంగ ప్రదేశాలలో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలు పక్కాగా పాటించాలన్నారు. నీరు ,ఇసుక వంటి అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాల న్నారు.18 ఏళ్ల లోపు పిల్లలను విక్రయాల పనుల్లో పెట్టరాదన్నారు. దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.