సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
ఘనంగా ట్రినిటీ విద్యా సంస్థ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో శుక్రవారం ట్రినిటీ విద్యా సంస్థ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రశాంత్ రెడ్డి నివాసంలో కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షుడు నూనెటి కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో యూత్ మండల నాయకులు దర్ములా రవి పాల్గొన్నారు.