సిరా న్యూస్;
పశ్చిమాసియాలో ప్రతికార యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. గొలుసులా కొనసాగుతున్న పరిణామాల మధ్య యుద్ధంలో చివరి అంకం మొదలైనట్లే కనిపిస్తోంది. దాదాపు ఐదు దేశాల్లోని మిలీషియాతో తలపడుతున్న ఇజ్రాయెల్.. చివరిగా ఇరాన్‌పై దృష్టి పెట్టింది. 45 ఏళ్ల తర్వాత ఇరాన్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య ప్రత్యక్ష యుద్ధం షురూ అయ్యిందనే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మిడిల్ ఈస్ట్, అత్యంత భయంకరమైన పరిస్థితుల మధ్య అల్లాడుతోందిమిడిల్ ఈస్ట్‌లో ప్రధాన ప్లేయర్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్మున్నాయి. ఈ రెండు దేశాలూ తలపడితే మధ్య ప్రాచ్యం మసై పోతుందేమో అనే అనుమానాలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. అక్టోబరు 1న, ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన క్షిపణి దాడికి 25 రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతిస్పందించింది. ఇరాన్‌పై “ఖచ్చితమైన దాడులు” అనే పేరుతో అక్టోబర్ 26 తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తుందని ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలపై సూర్యోదయానికి ముందే ఇజ్రాయెల్ దాడి ముగిసింది. ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులను నిర్వహించడం ద్వారా ప్రస్తుతానికి ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యం నెరవేరిందని పేర్కొంది.అక్టోబరు 1న, ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాదాపు 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో చాలా క్షిపణులను అమెరికా దళాల సహాయంతో నిర్మించిన ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. అయితే, ఇరాన్ చేసిన ఆ దాడి… లెబనాన్‌లోని హిజ్బుల్లాకు, ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన వరుస దాడులకు ప్రతిస్పందనగా చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అలాగే, హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లాను వైమానిక దాడిలో చంపేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత, సరిహద్దుల గుండా దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యాన్ని పంపింది. లెబనాన్‌పై కూడా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లాను తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో లెబనాన్‌లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకస్మిక దాడులతో లెబనాన్ అల్లకల్లోలం అయ్యింది., ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి ఇరాన్ ప్రాక్సీలుగా మిడిల్ ఈస్ట్‌లోని పలు తీవ్రవాద గ్రూపులను వినియోగించుకుంటుంది. అయితే, ఇటీవల కాలంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై చేసిన దాడి మాత్రం ఏప్రిల్ నెలలోనే జరిగింది. నిజానికి, ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడి ప్రారంభించిన మరుసటి రోజు, అంటే, గతేడాది అక్టోబర్ 8 నుండి ఇజ్రాయెల్, హిజ్బుల్లా సరిహద్దు కాల్పుల యుద్ధంలో ఉన్నారు.యుద్ధం తీవ్రమయ్యి గాజాలో ఇజ్రాయెల్ దాడులపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా వచ్చాయి. గాజా స్ట్రిప్‌ని బాంబులతో జల్లెడ పట్టిండి ఇజ్రాయెల్. పదుల సంఖ్యలో హమాస్ అగ్ర నాయకత్వాన్ని అంతం చేస్తూ వచ్చింది. అయితే, హమాస్‌కు సంఘీభావంగా లెబనాన్ కేంద్రంగా నడుస్తున్న హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లను కాల్చడం ప్రారంభించింది. దీనితో, కొన్ని రోజులు ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధం భీకరంగా కొనసాగింది. ఇక, ఇరాన్ బ్యాకప్‌గా ఉన్న ఈ గ్రూపులపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అప్పడప్పుడు ఇరాన్ కూడా కలుగజేసుకుంటూ ఉంది. అదే, తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడానికి కారణం అయ్యిందియుద్ధం మొదలైనప్పటి నుండీ ఇజ్రాయెల్‌కు అమెరికా సహకారం ఎక్కువగా ఉంది. ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్‌కు వెళ్లి వచ్చే ఓడలపై దాడి చేస్తున్న హౌతీ తీవ్రవాదులను ఎదుర్కోవడం దగ్గర నుండీ ఇజ్రాయెల్‌కు ఆయుధ సహకారం, సైనిక శిక్షణా సహకారం వంటివి అందిస్తూనే ఉంది. అయితే, ఇరాన్‌పై చేస్తున్న దాడుల్లో మాత్రం అమెరికా నేరుగా పాల్గొనలేదని పేర్కొంది. అయితే, యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్, ఇతర ఉన్నతాధికారులు ఇజ్రాయెల్ చేస్తున్న నిర్థిష్ట లక్ష్య దాడులను కొనసాగించమని ప్రోత్సహిస్తున్నారు. ఇరాన్‌పై తాజా దాడి కూడా అందులో భాగంగానే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందిస్తే, దాని నుండి ఇజ్రాయెల్‌ని రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ సిద్ధంగా ఉందని, ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అధికారులు రెడీ ఉన్నారని అమెరికా వెల్లడించింది.ఇజ్రాయెల్ తాజాగా చేసిన దాడులను ఇరాన్ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. దీనివల్ల “పరిమిత నష్టం” మాత్రమే జరిగిందని ఇరాన్ వెల్లడించింది. అక్టోబర్ 26 తెల్లవారుజామున ఇరాన్ వ్యాప్తంగా సైనిక కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలిపింది. టెహ్రాన్, ఖుజెస్తాన్, ఇలాం ప్రావిన్సులలోని సైనిక కేంద్రాలలోని కొన్ని భాగాలపై ఈ దాడి జరిగినట్లు ఇరాన్ నివేదించింది. “ఈ దాడిని ఇరాన్ సమగ్ర వాయు రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని వెల్లడించింది. టెహ్రాన్‌తో పాటు దేశం చుట్టూ అనేక ప్రాంతాలలో వైమానిక రక్షణను మోహరించినట్లు ఇరాన్ అధికారులు చెప్పారు.అయితే, “ఇటీవల కాలంలో ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందన ఈ తాజా దాడితో ముగిసిందనీ.. ఇజ్రాయెల్‌కు ఉన్న తక్షణ బెదిరింపులను అడ్డుకున్నామని” ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. “ఇక ఇరాన్ కొత్తగా మరో రౌండ్ దాడులు ప్రారంభిస్తే.. ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా ప్రతిస్పందస్తుందని” హెచ్చరికలు కూడా చేశారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ స్పష్టంగా ఉందనీ.. ఇజ్రాయెల్‌ను ఇంకా ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసినా.. ఈ యుద్ధాన్ని ఇంకా విస్తరించాలని కోరుకున్న పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. ఇజ్రాయెల్‌కు హాని కలిగించాలని కోరుకునే వారందరూ దానికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని వెల్లడించారు. “నిర్ణయాత్మకంగా వ్యవహరించే సామర్థ్యం, సంకల్పం రెండూ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని ఈ రోజు నిరూపించమని” అన్నారు. ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి ఎలాంటి నేరమైన చేస్తామని, ఇజ్రాయెల్ ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
=====================