సిరా న్యూస్,సికింద్రాబాద్;
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసారు. తరువాత ఆమెను మేడ్చల్ కోర్టులో హాజరపరిచారు. కోర్టు జ్యోతి కి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. సుభాష్ నగర్ లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి కబ్జా చేసినట్లు గుర్తించారు. అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన జ్యోతి, నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌కు పద్మజా రెడ్డికి సహకరించినట్లు గుర్తించారు. ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసారు. ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్ చేసారు.