సిరా న్యూస్,నాంపల్లి;
హీరో నాగార్జున అక్కినేని పరువు నష్టం కేసు విచారణ వచ్చే నెల 13 కు నాంపల్లి స్పెషల్ కోర్టు వాయిదా వేసింది. మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో విచారణ 13 కు ఇన్చార్జ్ న్యాయమూర్తి వాయిదా వేసారు.
కొండా సురేఖ తరఫున న్యాయవాది గురుమిత్ సింగ్ హజరయ్యారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కుడా నవంబర్ 13 కు వాయిదా పడింది.