సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్, నగరంలోని అన్ని జోన్ల నుండి వచ్చిన సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీలతో కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ లో ఇటీవల నగరంలో జరిగిన సున్నితమైన మతపరమైన సమస్యలపై పరస్పరంగా చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ మధ్య నగరంలో కొంతమంది వ్యక్తుల చెడు చేష్టల వల్ల కలిగిన దుష్పరిణామాలపై, పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అందరు కలిసి ఏకగ్రీవంగా ఖండించారు. ఈ సందర్భంగా పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పీస్ వెల్ఫేర్ కమిటీ మరియు పోలీసుల మధ్య సత్సంబంధాలు మెరుగు పరుచుకోవాలి, ఏదైనా శాంతి భద్రత ల సమస్య వచ్చినప్పుడు ఈ పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యుల ద్వారా సమస్యను సులువుగా పరిష్కరించ వచ్చును అని తెలిపారు.
వివిధ మత సమూహాల మధ్య అవగాహన మరియు సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలి మరియు శాంతిని నెలకొల్పటానికి నివారణ చర్యలో బాగంగా పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విద్యా సంస్థలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
సివి ఆనంద్ మాట్లాడుతూ పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు హైదరాబాదు నగరములో శాంతిని నెలకొల్పటానికి కీలక మైన రోల్ నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇక ముందు కూడా మీ ఏరియాలో పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు గా కొనసాగుతూ శాంతిని నెలకొల్పటానికి మీ సేవలు ఎంతైన అవసరము ఉన్నది అని మరియు శాంతి భద్రతలను పరిరక్షించడానికి, స్థానిక పోలీసులకు సహకరించాలని తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు మీ అవిశ్రాంత కృషిని కొనసాగించాలని శాంతి కమిటీ సభ్యులను కోరారు. పీస్ వెల్ఫేర్ కమిటీలో యువతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని తెలిపారు.
ముగింపు కార్యక్రమములో పీస్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైదరాబాదు సిటీ పోలీసులకు మద్దతు గా ఉంటూ మరియు రాబోయే పండుగలను శాంతియుత వాతావరణములో జరిగే విధముగా, సమాజంలోని సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిర్మూలించడానికి, ప్రజల్లో సామరస్య భావము, ఐక్యత నెలకొల్పే విధంగా కమ్యూనిటీ వర్క్‌షాప్‌లను నిర్వహిస్తామని కమిటీ ప్రతిజ్ఞ చేసింది.