సిరా న్యూస్,హనుమకొండ;
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ శిలాఫలకాల వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ S హయాంలో వేసిన శిలాఫలకాలను తొలగించి కాంగ్రెస్ నేతలు మళ్లీ కొత్త శిలాఫలకాలు వేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అందో్ళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు కొత్త సంస్కృతికి తెరలేపారని ఆరోపించారు. దామెర మండలంలోని సింగరాజుపల్లి, వెంకటాపూర్, ల్యాదేళ్ల, హరిచంద్రనాయక్ తండా గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మారితే శంకుస్థాపన శిలాఫలకాలు మార్చుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికార – ప్రతిపక్ష నాయకుల మధ్య శిలాఫలకాల పంచాయితీ ముదురుతోంది