సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. శుక్రవారం రాత్రి ఈదురు గాలులు, అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం కలిగింది. జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వరి వానపాలయింది. నెక్కొండ మండలంలో నీటి పాలైన వరి ధాన్యం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పంట నీటి పాలవడంతో లబోదిబోమంటున్నారు.