సిరా న్యూస్,హైదరాబాద్;
అజంపురాలో జనవాసాల మధ్య జాతీయ పక్షి నెమలి వచ్చింది. ఈ విషయం గమనించిన స్థానిక వ్యాపారి మహమ్మద్ అంజద్ పట్టుకొని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. నెమలి ఎక్కడినుండి జనవాసాల్లోకి వచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జాతీయ పక్షిని అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు