సిరా న్యూస్,పార్వతీపురం;
పార్వతీపురంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తూ. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా లాగి విసిరేసాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి. దీంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, ఎలాగైనా నష్టపరిహారం అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు నుంచి తమను రక్షించాలని వారు కోరుతున్నారు.