సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో పెన్షన్ డబ్బుల కోసం వృద్ధురాలు అవస్థలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో పెన్షన్ కోసం వృద్దురాలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలో ఏకైక బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్‌లో ఖాతా దారులు ఎక్కువ ఉన్న అధికారులు ఎస్బిఐ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం లేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట షట్టర్ ఎంత పెద్దగా ఉన్న షట్టర్‌ను కొంచెం తెరవడంతో ప్రతిరోజు ఖాతాదారు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. వృద్దురాలు నడవలేని స్థితిలో ఉన్న స్టాండ్ సహాయంతో వృద్ధురాలు పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకు వచ్చిన వేళ లోపలికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. షట్టర్ పూర్తిగా ఓపెన్ చేయాలని ఖాతాదారులు అంటున్నారు.