సిరాన్యూస్, బేల
పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్మ రాం రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల సబ్ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్మ రాం రెడ్డి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన పత్తి లో తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరంమార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్మ రాం రెడ్డి మాట్లాడుతూ సీసీఐ ద్వార ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు సరైన తేమ శాతం పత్తిలో వుండేలా చూసుకోవాలని అన్నారు .అప్పుడే పూర్తి స్థాయిలో రైతులకు పూర్తి మద్దతు ధర లభిస్తుందన్నారు. అలాగే మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహమూద్, గుండా వార్ సంజెయ్, అధికారులు ,రైతులు పాల్గొన్నారు.