Gundalwar Narayana Swamy: స్వామి వారికి రూ.15 లక్షల మకర తోరణం బహూకరణ:  గుండాల్వర్ నారాయణ స్వామి

సిరాన్యూస్‌, జైన‌థ్‌
స్వామి వారికి రూ.15 లక్షల మకర తోరణం బహూకరణ:  గుండాల్వర్ నారాయణ స్వామి

ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో గురువారం స్వామి వారికి 13 కిలోల వెండి తో కూడిన రూ.15 లక్ష ల విలువైన వెండి మకర తోరణం ఆదిలాబాద్‌కు చెందిన‌ గుండాల్వర్ నారాయణ స్వామి -ఊర్మిళ (రిటైర్డ్ టీచర్) స్వామి వారికి బహుకరించారు. అనంత‌రం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈసంద‌ర్బంగా గుండాల్వర్ నారాయణ స్వామి -ఊర్మిళల‌ను ఆల‌య క‌మిటీ స‌భ్యులు స‌న్మానించారు. కార్య‌క్ర‌మంలో ఆలయ అర్చకులు వెంకట రమణాచారి ,ధీరజ్ కుమార్ ఆలయచైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *