సిరా న్యూస్,మధిర;
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శుక్రవారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయంలో మధిర మున్సిపల్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
భట్టి మాట్లాడుతూ నేను నా మధిర క్లీన్ అండ్ గ్రీన్. ఈనెల 14 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు.
మధిర పట్టణంలోకి వచ్చే ప్రతి చోట పచ్చదనం ఉట్టిపడేలా పార్కులు ఏర్పాటు చేయాలి. రాయపట్నం బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు శివాలయం మీదుగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి. తడి పొడి చెత్త సేకరణకు ఇంటింటికి చెత్త డబ్బాలను పంపిణీ చేయండి. ప్రతిరోజు ఇంటింటి నుండి తడి పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలి. మధిర పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి స్విపీంగ్ మిషన్ కొనుగోలు చేయండి. మున్సిపల్ తో పాటు మండల కేంద్రాల్లో పిచ్చి మొక్కల తొలగింపుకు ట్రీ కట్టర్, గ్రాస్ కట్టర్స్ కొనుగోలు చేయాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చారు. పాత డంపింగ్ యార్డ్ కు వెళ్లి ఇంటర్నల్ రోడ్డును వెంటనే పూర్తి చేయాలి. మధిర మున్సిపాలిటీలోని చెత్త సేకరించే వాహనాల మూమెంట్ తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన జిపిఆర్ఎస్ ట్రాకింగ్ ను కలెక్టర్ మొబైల్ కు కనెక్ట్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశం ఇచ్చారు.
అధునాతనంగా మధిర మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఉండేలా డైమెన్షన్ వేయించాలి. ఖాళీ ప్లాట్ లలో చెత్తచెదారం లేకుండా సంబంధిత యజమానులకు అవగాహన కల్పించాలి. మధిర పట్టణంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడ పచ్చదనం కూడా ఏర్పాటు చేయండి. మధిర మున్సిపల్ పరిధిలో రోడ్డు హద్దులు దాటి నిర్మాణాలు జరిగితే మున్సిపల్ కమిషనర్ దే బాధ్యత. మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీలో వీధి దీపాలు వెలిగే విధంగా నిత్యం పర్యవేక్షణ చేయాలి. మధిర పట్టణంలోని వరద మంపు ప్రాంతాల్లో సాచిరేషన్ పద్ధతిలో సిసి రోడ్లను పునరుద్ధరించాలని అన్నారు.