స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఉద్యోగాలు
కేఎల్ఆర్
సిరా న్యూస్,మహేశ్వరం;
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు జల్ పల్లి మున్సిపాలిటీలో మైనార్టీ ఛైర్మన్ యూసుఫ్ ఖాద్రీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కేఎల్ఆర్ మాట్లతాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపుతో ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. పేదరికం పోవాలంటే మంచి విద్య – ఉద్యోగం ఉండాలి. జల్ పల్లి మున్సిపాలిటీ హైదరాబాద్ లో విలీనమైతే రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అంతా బాగుపడుతుందన్నారు. ఇక్కడి పేదలు, టాక్సులు కట్టలేని పరిస్థితిలో ముస్లింలు ఉన్నారని… అందువల్ల భవిష్యత్ లో పిల్లలను స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేసి… మంచి ఉద్యోగాలు పొందేలా చేయాలని లక్ష్మారెడ్డి కోరారు. ఆవో – సీకో – గరీబీ హఠాహో అన్నారు కేఎల్ఆర్.
ఈ సందర్భంగా పేదలకు సహాయం చేస్తున్న యూసుఫ్ ఖాద్రీని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అభినందించారు.