సిరా న్యూస్,ములుగు;
విశ్వసనీయ సమాచారం మేరకు ములుగు పోలీసులు మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్నారు. తాడ్వాయి మండల పరిధిలో గల బంధాల రిజర్వు అటవీ ప్రాంతంలోని వోడ్డుగూడెం గ్రామ సమీపంలో వెట్టే వాగు వద్ద మావోయిస్టు ఆయుధాల డంప్ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 11:00 గంటలకు ములుగు జిల్లా పోలీసు లు, బాంబు డిస్పోజల్ టీం బృందాలు అనుమానస్పద ప్రాంతానికి చేరుకొని సోదాలు నిర్వహించాయి. గా ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చిన ఆయుధాల డంప్ ను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.