సిరా న్యూస్,మచిలీపట్నం;
ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హజరయ్యారు. షర్మిల మాట్లటాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణన జరగాలి.కూటమి ప్రభుత్వాన్ని ఏపీసీసీ డిమాండ్ చేస్తుంది.బాబు,జగన్ ఇద్దరు కుల గణన జరుపుతాం అని హామీ ఇచ్చారు. కుల గణన జరిపి బీసీలకు న్యాయం చేయండని అన్నారు.
మన మోడీ ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే . ఆయన బీసీ అయ్యి ఉండి..ఆయన మాత్రమే గర్వంగా ఉన్నాడు. బీసీలు మాత్రం గర్వంగా లేరని అన్నారు, కుల గణన కు బీజేపీ వ్యతిరేకం అన్నారు. బీజేపీ కి బీసీ ల పట్ల ప్రేమ లేదు. బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు. బీజేపీ అగ్రకుల పార్టీ. అదానీ,అంబానీ లకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ. బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు కి ప్రేమ లేదని అన్నారు. బీజేపీ కి గత 10 ఏళ్లుగా బాబు,జగన్ లు ఊడిగం చేస్తున్నారు. జగన్ సైతం బీసీలను మోసం చేశాడు. నా బీసీలు అని మోసం చేశాడు. ప్రతి ఏడాది 15 వేల కోట్లు ఇస్తా అన్నాడు. 5 ఏళ్లలో 75 వేల కోట్లు ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు 75 వేలు ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు.