ఏఐటియుసి పిలుపు
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
నిచేయించండి ప్రభుత్వాన్ని ఏఐటియుసి తాడేపల్లిగూడెం ఏరియా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం తాడేపల్లిగూడెంలో భవనిర్మాణ కార్మిక సంఘం భవనంలో భవన నిర్మాణ కార్మికులు సమావేశం ఈ సంఘం అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం ఏరియా ఏఐటియుసి కార్యదర్శి మందలపర్తి హరీష్ భవనిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పాలన కాలంలో భవన నిర్మాణo, వెల్ఫేర్ బోర్డుని పని చేయించడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. నిర్మాణరంగం కార్మికులు కనీసం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన ఐదు నెలలు కావస్తున్న భవనిర్మాణ కార్మికులు కు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. నిర్మాణాలపై వసూలు చేసిన సెస్సును భవనిర్మాణ కార్మిక ఖర్చు చేయలని డిమాండ్ చేశారు. సిమెంటు, ఐరన్ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లైములు తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏఐటియుసి రాష్ట్ర సమితి పిలుపుమేరకు భవనిర్మాణ కార్మిక సమస్యల పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డ్ ను పనిచేయించాలని ఈ నెల 11న భీమవరంలో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సంయుక్త కార్యదర్శి కే లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం భవనిర్మాణ కార్మికులను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో ఇసుక సప్లై శాశ్వత పరిష్కారం చూపించలని ఆయన కోరారు కోశాధికారి కోడె సాయి బాలాజీ. అత్తిలి రెడ్డమ్మ. పంతం రామకృష్ణ బాలాజీ. శెట్టిసింహాచలం. ఉప్పులూరు మధు. తాళ్లపాలెం రమణ భవనిర్మాణకార్మికులు పాల్గొన్నారు.
=============================xxx