సిరా న్యూస్,ఉ తాడేపల్లిగూడెం;
తాడేపల్లిగూడెం మండలం జగన్నాధపురం లో జిల్లా పరిషత్ భూముల్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పటికే జిల్లా పరిషత్ భూముల్లో సుమారు 400 గజాలమేర ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్లాబు వరకు పనులు చేరిన తరువాత అధికారులు పనులను అడ్డుకున్నారు. దాంతో పాటు మరికొంత భూమిని ఆక్రమించి వ్యవసాయం చేస్తున్నట్టు తెలియ వచ్చింది. ఇళ్ల స్థలాల నిమిత్తం రెవిన్యూ అధికారులకు అప్పగించగా వారు దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఈ భూములు జిల్లా పరిషత్ కు చెందినవి కావడంతో ఆ శాఖ అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో యదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సమాచారం. దీనిపై స్థానిక నాయకులు ఫిర్యాదులు చేయడంతో తాజాగా స్లాపు నిర్మాణాలను పంచాయతీ అధికారులు అడ్డుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్టు తెలియ వచ్చింది. ఇంకా ఆ అక్రమ నిర్మాణదారుడు స్లాబు వేసేందుకు తన ప్రయత్నాలు తను చేస్తున్నట్టు సమాచారం.