– వాగులో నలుగురు యువకులు గల్లంతు
సిరా న్యూస్,అల్లూరు;
అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో విషాదం జరిగింది. తిమ్మాపురం గ్రామ సమీపంలోని కొండవాగు వద్ద ట్రాక్టర్ లో ఇసుక లోడ్ చేస్తుండగా లోతు తెలియక నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. గల్లంతైన వారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం వాసులుగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ పరిశీలించారు. గల్లంతైన నలుగురు యువకుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.