ఫూట్ పాత్ అక్రమణల తొలగింపు

సిరా న్యూస్,రాజేంద్రనగర్;
గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.వట్టేపల్లి రైల్వే గేటు నుంచి శాస్త్రిపురం వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన రేకుల షెడ్లు , డబ్బాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫుట్ పాత్ ఆక్రమనలతో రోడ్డు చిన్నగా మారి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుండటంతో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *