-అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-మంథని మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి
సిరా న్యూస్,మంథని;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తములో భాగంగా ఆరు గ్యారంటీలను అమలు పరుచుటకు ప్రజా పాలన కార్యక్రమము నిర్వహించ బడుతున్నదని మంథని మున్సిపల్కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తెలిపారు. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికిడిసెంబర్ 28వ తేది నుండి జనవరి 6వ తేది వరకు అన్ని వార్డులలో ప్రజా పాలన వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 8.00 గంటల నుండి మద్యాహ్నం12.00 గంటల వరకు మరియు మద్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు వార్డులో సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈనెల 28న జెడ్ పి హెచ్ ఎస్చైతన్యపురి కాలనీలో ఒకటవ వార్డువారికి ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 12.00 వరకు,మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 6.00 వరకు 8 వార్డు గణపతి మండపం, పోచమ్మవాడ లో, 29నఉదయం 2 వార్డు వారికి ప్రభుత్వ ఉన్నత పాటశాల, కాలేజీ గ్రౌండ్లో, మధ్యాహ్నం 9వ వార్డు వారికి గర్ల్స్ హై స్కూల్ ల్లో, 30న ఉదయం 3 వార్డువారికి పురపాలక సంఘ కార్యాలయము లో, మధ్యాహ్నం 10వార్డువారికి ప్రభుత్వ గర్ల్స్ కళాశాల, అయ్యప్ప గుడి వద్ద, జనవరి 2న ఉదయం 4వ వార్డు వారికి ప్రాథమిక పాటశాల,బోయినిపేట లో, మధ్యాహ్నం 11వ వార్డు వారికి పురపాలక సంఘ కార్యాలయము లో,జనవరి 3 తేదీ ఉదయం 5 వార్డ్ వారికి ప్రాథమిక పాటశాల కూచిరాజ్ పల్లిలో, మధ్యాహ్నం 12 వ వార్డు వారికి పురపాలక సంఘ కార్యాలయము లో, జనవరి 4న ఉదయం 6వ వార్డు వారికి ప్రాథమికపాటశాల, గంగాపురిలో, మధ్యాహ్నం 13వ వార్డు వారికి గణపతి మండపం, పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయము లో, జనవరి 5న ఏడవ వార్డు వారికి కన్యకా పరమేశ్వరి పంక్షన్ హాల్, దొంతులవాడ లో
సభలలు నిర్వహిస్తామన్నారు. ఈ సభలలో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. దరఖాస్తు ఫారాలు వార్డు సభకు ముందుగానే ఏరియా బిల్కలెక్టర్, మహిళా సంఘాల ఆర్.పి.ల దగ్గర ఉచితంగా లభిస్తాయన్నారు. ఇట్టి దరఖాస్తు ఫారాలను పూరించి ఆధార్, రేషన్ కార్డు జిరాక్సు కాపీలను జత చేసి ప్రజాపాలన వార్డు సభలో అందచేయాలన్నారు.దరఖాస్తులు పూరించడానికి అవసరమైన పక్షములో అంగన్వాడి, ఆశ వర్కర్లు, సహకరిస్తారని ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకొని సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందాలని ఆయనకోరారు.