మాజీ మంత్రి హరీష్ రావు
సిరా న్యూస్,మెదక్;
మెదక్ పట్టణంలోని వైస్రాయ్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు సమావేశానికి హాజరైయారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు కృతజ్ఞతలు చెప్పాలనే సమావేశం ఏర్పాటుచేశాం. మెదక్ లో ఓటమి చెందడం దురదృష్టకరం. తక్కువ మెజార్టీతోనే మెదక్ లో ఓడిపోయాం. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలు గెలిచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను వచ్చి పనిచేసి గెలిపిస్తా. మీరంతా నా కుటుంబ సభ్యులే.. మీకు ఏ ఆపద వచ్చినా నేనుంటా. బీఆర్ఎస్ 20 గంటల కరెంట్ ఇచ్చిందని అసెంబ్లీ లో కాంగ్రెస్ వాళ్లు చెప్పారు. రూ 50 వేల కోట్లు విద్యుత్ శాఖకు ఖర్చు చేసి రైతులకు కరెంట్ ఇచ్చామని అన్నారు.
ఏంఎన్ కెనాల్, ఎఫ్ఎన్ కెనాల్ లలో తుమ్మ చెట్లు మొలిస్తే బాగుచేశాం. హైదరాబాద్ కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చాం. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్ డ్యామ్ లు కట్టినారా. కాళేశ్వరం, కొండపోచమ్మల ద్వారా సాగునీరు ఇస్తున్నాం. కేసీఆర్ అంటే నమ్మకం..బీఆర్ఎస్ అంటే విశ్వాసం. కరోనా వచ్చినా రైతులకు రైతు బంధు వేశామని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదు. రైతు బంధు కింద 13 సార్లు రూ. 72 వేల కోట్లు ఇచ్చాం. రైతు భీమా ద్వారా రైతు కుటుంబాన్ని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బీమా దండగ అని అసెంబ్లీ లో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెసోళ్లు అసెంబ్లీ లో అన్నీ జుటా మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం నేను మెదక్ జైల్లో మూడు రోజులున్న. తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్. తెలంగాణతో బీఆర్ఎస్ ది పేగుబంధం. తెలంగాణ కోసం రాజీనామాలు చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ ప్రజల మీద కమిట్మెంట్ తో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెసోళ్లు అధికారం కోసం తహతహలాడుతున్నారు. కాంగ్రెసోళ్లు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా ఏందో చూపిద్దాం. మెదక్ ఎంపీ గెలవడం పక్కా . ఎవరు అధైర్య పడద్దు..భవిష్యత్ మనదే. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. కేసీఆర్ ఏడుపాయల అభివృద్ధికి రూ 100 కోట్లతో జీఓ ఇచ్చారు ..అభివృద్ధి చేస్తారో లేదో చూద్దామని అన్నారు.
మెదక్ పట్టణానికి రూ 50 కోట్ల జీఓ ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తాం. సోషల్ మీడియా లో ఫేక్ వార్తలతో బీఆర్ఎస్ పై ద్రుష్పచారం చేస్తున్నారు. మీకు ఏ కష్టమొచ్చినా గంటలో మీ ముందుంటా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో కొట్లాడుదామని అన్నారు.