మర్రి విక్రాంత్
సిరా న్యూస్,బోగోలు;
వరుసగా రెండవసారి కూడా ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ టాబ్లెట్లు పంపిణీ చేసే మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టారనివిద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల సమాచారం మొత్తాన్ని ట్యాబ్లో పొందుపరిచి పుస్తకాల భారం తగ్గించే విధంగా చర్యలు చేపట్టారని బోగోలు మండల వైకాపా కన్వీనర్ మద్దిబోయిన వీర రఘుఅన్నారు. మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు మరియు బోగోలు మండలం ఎంపీపీ మేకల సుజాత ఆధ్వర్యంలో నాగులవరం మరియు కొండ బిట్రగుంట గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినివిద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల లోని సిలబస్ పొందుపరిచినటువంటి ట్యాబ్లను బుధవారం ఉదయం విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ ట్యాబులను సక్రమంగా ఉపయోగించుకునిభావితరాలలో ఉన్నత పౌరులుగా నిలచి దేశానికి మంచి పేరు తీసుకుని రావాలని విద్యార్థులకు మద్దిబోయిన విరులకు సూచనలు అందించారు. పై కార్యక్రమంలో జడ్పిటిసి మద్దిబోయిన కీర్తన, బోగోలుమండలం ఎంపీపీ మేకల సుజాత, పాపన మల్లారెడ్డి, బిట్రగుంట సర్పంచ్ శ్రీరామ్ గోపాల్, బోగోలు మండలం వైకాపా యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు, గూగుల్ మండల కోఆప్షన్ నెంబర్ రసూల్,మరియు కార్యకర్తలు వైకాపా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు