మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష…..

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ దగ్గర నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయచుండగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉండి రోడ్డుపైన వాహనాలునడుపుతూ పట్టు పడగా సదరు వ్యక్తులను విచారించి స్వాధీనంలోనికి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టు నందు చార్జి షీట్ దాఖలు చేసి, నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ R. రామభూపాల్ రెడ్డి ముందు హాజరుపరచగా సదరు జడ్జి ముద్దాయిలకు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *