సిరా న్యూస్,అనంతపురం;
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయదుర్గం నియోజకవర్గం ఎ మ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చేసిన అవినీతి చిట్టాను నిరూపించి తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే జైలుకు పంపిస్తానని మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు.తాను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డానని కాపు రామచంద్రారెడ్డి అనంతపురంలో ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలు చేశాడన్నారు. వైసీపీ అధిష్టానం కాపుకు టిక్కెట్‌నిరాకరించడంతో మతిభ్రమించి తనపై లేనిపోని ఆరోపణలు చేసి పార్టీ అధిష్టానంతో మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. తాను ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా అవినీతిచేసినట్లు నిరూపించే సత్తా ఉంటే ఎప్పుడైనా విచారణకు సిద్ధమన్నారు. రాష్ట్రంలోని 151 ఎమ్మెల్యేలలో అవినీతి పరుడిగా కాపు రామచంద్రారెడ్డి అపఖ్యాతి తెచ్చుకుని వైసీపీ అధిష్టానంలో చులకనఅయ్యాడన్నారు. ఆయన ఇక్కడ పోటీ చేస్తే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఉద్దేశంతో పార్టీ అధిష్టానం వేరేవాళ్లకు టిక్కెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఒక వేళ కాపు రామచంద్రారెడ్డికేరాయదుర్గం టిక్కెట్ ఇస్తే తాను టీడీపీ తరపున 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. తనను స్థానికుడు కాడని కాపు రామచంద్రారెడ్డి ఆరోపణ చేస్తున్నాడని ఆయన ఇక్కడ స్థానికుడాఅంటూ ప్రశ్నించారు.