సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీవినాయక స్వామివారు, శ్రీచంద్రశేఖర స్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు.సాయంత్రం 6. 30నుండి రాత్రి 8గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీవినాయకస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామి వారుకపిలతీర్థం పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించా రు.వైభవంగా జరిగిన తెప్పొత్సవాలతో పుష్కరణి సరికొత్తశోభను సంతరించుకుంది.