సిరా న్యూస్,హైదరాబాద్;
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో పలు డివిజన్లో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. రహమత్ నగర్, బోరబండ డివిజన్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతోపాటు అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదిలా ఉండగా పలు కేంద్రాల వద్ద అనుకున్న దానికన్నా ప్రజలు ఎగబడటంతో సమయాలు మార్పు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో కేవలం 500 దరఖాస్తులు మాత్రమే ఇవ్వగా మిగిలినవారు జిరాక్స్ తీసుకొని దరఖాస్తు చేస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దరఖాస్తు ఫారం లు కేవలం తెలుగులో ఉండడంతో కొంతమందికి ఇబ్బందిగా మారిందని పేర్కొంటున్నారు.