సిరా న్యూస్,చింతూరు;
చింతూరు మండలం మోతుగూడెం లో 3 లక్షలు విలువచేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రెండు వేరువేరు కేసుల్లో 60 కేజీల గంజాయి సీజ్ చేసారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనకి చేపట్టగా, రెండు వేరు వేరు కేసులలో కారు మరియు ద్విచక్ర వాహనంలో లో 3 లక్షలు విలువచేసే 60 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ గంజాయి సీలేరు దారకొండ నుండి విజయవాడ ఉత్తర ప్రదేశ్ తరలిస్తుండగా పట్టుకున్నామని, 5 గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించామని సబ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు తెలిపారు.