సిరా న్యూస్,అమరావతి;
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుజనవరి 5 నుంచి 29 వరకు బహిరంగ సభలలో పాల్గోంటున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ ప్లాన్ చేసింది. ప్రతి బహిరంగ సభకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక రూపోందించింది. జనవరి 5 న ఒంగోలు పరిధి లోని కనిగిరి లో బహిరంగ సభ వుంటుంది. జనవరి 7 న తిరువూరు, ఆచంట, జనవరి 9 న వెంకటగిరి, ఆళ్లగడ్డ, జనవరి 10 న పెద్దాపురం, టెక్కలి, జనవరి 11 నరసరావుపేట లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. జనవరి 29 నాటికి 25 సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ పై కసరత్తు చేస్తున్నారు.