సిరా న్యూస్,హైదరాబాద్;
2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదే పరిస్థితి కనిపించింది వైసీపీ సర్కార్‌కు. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేసింది.అన్ని ఖాళీ చేసి పోయిండ్రా నాయనా.. ఏమీ లేదు.. వచ్చి చూస్తే ఖాలీ గిన్నలే కనిపిస్తున్నయ్.. మేం లంకె బిందులు అనుకుని వస్తే.. ఖాళీ కుండలు కనిపిస్తున్నయ్.. ఇగ దానిని సరిదిద్దాలె’ ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ చేసిన మోసాన్ని, లూటీని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఆరు గ్యారంటీలు ఎలా అని ప్రశ్నిస్తున్నారు.2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదే పరిస్థితి కనిపించింది వైసీపీ సర్కార్‌కు. అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేసింది. ఖజానాలో రూపాయి కూడా లేకుండా ఊడ్చుకెళ్లింది. అచ్చం ఇలాగే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా వెల్లడిస్తున్నారు.2019లో ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అడుగంటినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 9 హామీల అమలుకు శ్రీకారం చుట్టారు అమ్మ ఒడి పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని అప్పులు చేశారు. కొన్ని గ్రాంట్లు మంజూరు చేయించుకున్నారు. మిగతావి రాష్ట్ర ఖజానా నుంచి సేకరించి బటన్ నొక్కి.. ప్రజల ఖాతాల్లోకి డబ్బులు తరలిస్తున్నారు.ఇప్పుడు రేవంత్ ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలి, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎలా అమలు చేయాలో తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆరు గ్యారంటీల అమలుకు కనీసం రూ.6.5వేల కోట్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో నిధులు సమీకరించడం రేవంత్ సర్కార్‌కు సవాలే. దీనిని ఎలా అధిగమిస్తాడో అన్న చర్చ జరుగుతుండగానే ఇచ్చిన మాట ప్రకారం.. ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. మరోవైపు నెటిజన్లు రేవంత్ కామెంట్‌పై స్పందిస్తున్నారు.. మీ రాజకీయ గురువు చంద్రబాబు చేసిన పనే.. ఇప్పుడు కేసీఆర్ చేశారు… జగన్ బెదరలేదు.. మీరు కూడా భయపడకుండా హామీలు అమలు చేయండి అని సూచిస్తున్నారు.
========