ముళ్లపొదల్లో పసికందు

తల్లిని గుర్తించిన స్థానికులు
 సిరా న్యూస్,మేడ్చల్;
పుట్టిన కొద్ది క్షణాల్లోనే పసికందు ముళ్ళపోదలో లభించిన దారుణ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథన ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో గౌడవెల్లి గ్రామ పరిధిలో రైల్వేగేట్ ఆవల ఉన్న ముళ్ల పొదల్లో శిశువు ఏడుస్తున్నట్టు అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించాడు. లోపలికి వెళ్లి . బొడ్డుకూడ ఊదని ఆడ శిశువు పాలిథిన్ కవర్లో చుట్టి పడివేసినట్టు గుర్తించాడు. వెంటనే పక్కనే హోటల్ను నిర్వహిస్తున్న లక్ష్మి చెప్పాడు. వారు గ్రామ పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. ఆయన అశా కార్యకర్త ఏఎన్ఎంకు తీసుకొని హుటాహుటీనా ఘటనా స్థలికి వెళ్లాడు. అందరూ కలిసి ఆ శిశువును ముళ్ల పొదల్లో నుంచి జాగ్రత్తగా బయటికి తీశారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శిశువు తల, చెంపకు అంటుకున్న చీమలను తొలగించడంతో ప్రదమ చికిత్స అందించి, మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులతో పాటు సీడీపీవోకు సమాచారం అందించారు. సీడీపీవో శారద శిశువును ఆరోగ్య కేంద్రానికి తరలించేలోపే అక్కడికి చేరుకున్నారు. వైద్యులు పాపకు తగిన వైద్యం అందించారు.
ముళ్ల పొదల్లో పురిటి శిశువును పడవేసిన ఘటనపై ఆరా తీయగా పలువురు స్థానికేతరులు కోళ్లఫారంలో కార్మికులుగా పని చేసే తులసి(17), సంతోష్ (19) గురించి పోలీసులకు సమాచారం అందంచారు. వారిని పిలిపించి గట్టిగా మందలించడంతో తమ శిశువు అని ఒప్పుకున్నారు. నివాసం ఉన్న చోటనే ప్రసవించిన తులసి కొద్ది క్షణాల్లోనే ముళ్ల పాడల్లో పడవేసినట్టు స్థానికులు, పోలీసులు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *