సిరాన్యూస్, హుస్నాబాద్:
ఎల్లమ్మ చెరువును పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మత్తడి పడుతున్న హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, హుస్నాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిలో గల పందిల్ల బ్రిడ్జిని మంగళవారం హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.