సిరా న్యూస్,హైదరాబాద్;
హిమాయత్ సాగర్ జలాశయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ హిమాయత్ సాగర్ జలాశయం 4 ఫీట్లు వస్తె నిండిపోతుంది వర్షాలు తగ్గడం వల్ల ఇన్ఫ్లో తగ్గింది. ఒక్క వర్షం వచ్చిన జలాశయం పూర్తిగా నిండి పోతుంది. జలయశయం నిండితే కింద ఉన్న ప్రాంతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ,రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం.
హైదరాబాద్ నగరానికి సంబంధించిన జంట జలాశయాలు హిమాయత్ సాగర్,ఉస్మాన్ సాగర్ చూడడానికి రావడం జరిగింది..ఒక వర్షం పడితే పూర్తిగా 5 వేల క్యూసెక్కుల నీళ్ళు వస్తె 10 గంటల్లో నిండి ఓవర్ ఫ్లో అవుతుంది. ప్రభుత్వం తరుపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో వారిని కోరుతున్న ఇది విపత్కర సమయం ఇది రాజకీయాలకు సమయం కాదని అన్నారు.
ఈరోజు మరణాలు అన్ని ప్రమాదవశాత్తు జరిగాయి. ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినవి కావు. వారిని ఆడుకోవడానికి 5 లక్షల ఎక్స్ గ్రెషియ ఇస్తున్నాం..అందరినీ అప్రమత్తం చేస్తున్నాం..ప్రభుత్వ యంత్రంగా హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టకుండా నిరంతరం 24 గంటలు పని చేస్తున్నారు.పంట నష్టానికి , ప్రాణ నష్టానికి ,ఆర్థిక నష్టానికి సంబంధించి ప్రభుత్వ పంచాయతీ రాజ్ రోడ్లు & ఆర్ అండ్ బి రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. నష్టం జరిగింది. గతంలో ఇలాంటి ప్రకృతిలు వస్తె హైదరాబాద్ ప్రజలకు అమౌంట్ కూడా ఇయ్యని పరిస్థితి ఉండేది. అందరం కలిసి కేంద్రం ను అడుగుదాం బడ్జెట్ లాగ మొండి చేయి చూపకుండా సహకరించాలని అన్నారు. ..