సిరా న్యూస్,తిరుపతి;.
తిరుపతికి చెందిన దొంగ నోట్లు తయారీ ముఠాను పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రవికుమార్ ఈ కేసుకు సంబంధించి న వివరాలను మీడియాకు వెల్లడిం చారుతిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలోని తులిప్ రెసిడెన్సీ వద్ద గల రమేష్ తన ఇంటిలోని భార్య సంధ్య కూతురు నిషా స్నేహితుడు మునికృష్ణారావు లతో కలిసి దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా దొంగ నోట్లు ఎలా తయారు చేసే విధా నాన్ని నేర్చుకొని అందుకు తగిన పరికరాలను సమకూర్చుకున్నారు. మూడు నెలలు పాటు దొంగ నోట్లు తయారీని ప్రాక్టీస్ చేశారు. తర్వాత గత మూడు నెలల్లో 500 నోట్లను సుమారు 10 లక్షల మేరకు తయా రుచేశారు. వీటిని తిరుపతి శ్రీకాళ హస్తి, నెల్లూరు, వెంకటగిరి, చిత్తూ రులో చలామణి చేశారు. చివరగా పుత్తూరులో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 192 వంద రూపాయలు నోట్లు, 156 500 నోట్లను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు అలాగే నోట్లు తయారీకి అవసరమైన 29 రకాల పరికరాలతో పాటు వోక్స్ వాగన్ కారును స్వాధీనం చేసు కున్నారు, పుత్తూరులోని నిర్మల ప్రొవిజనల్ స్టోరీ యజమాని కె.కుప్పయ్య శెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన నలుగురిని పుత్తూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు పుత్తూరు డీఎస్పీ తెలిపారు.