సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
తిరుమల లడ్డు ప్రసాద తయారీలో జరిగిన అపచారానికి నిరసనగా కొత్తగూడెంలో సనాతన హిందూధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గణేశ్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీ వరకు మహాప్రదర్శన నిర్వహించారు. ఈయొక్క మహాప్రదర్శన లో వివిధ హిందు సంఘాల నాయకులు, భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ….. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామి యొక్క తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం అపచారం అని అన్నారు. ఇది సనాతన ధర్మాన్ని నాశనం చేయడమే అన్నారు. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.