సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామం వద్ద పల్సర్ బైక్ పై తరలిస్తున్న ఐదు కేజీల గంజాయిని ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు.ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు భద్రాచలం నుండి పల్సర్ బైక్ పై ఐదు కేజీల గంజాయిని గుంటూరు తీసుకు వెళుతున్న క్రమంలో బయన్నగూడెం వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సెల్ ఫోన్లు,బైక్ ను సీజ్ చేశారు.