ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

సిరా న్యూస్,కోదాడ;
ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆర్టీసీ బస్సులోనే కాన్పూ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద చోటు చేసుకుంది. అనంతగిరి మండలం మొగలైకోట గ్రామానికి చెందిన అలివేలు అనే మహిళా ఏడో నెల గర్భవతి. ఆమె వైద్య పరీక్షల నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకుని తిరిగి స్వగ్రామానికి కోదాడ డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా మునగాల మండలం తాడ్వాయి వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి పక్కనే ఉన్న ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది పరిస్థితి చూసి ఆర్టీసీ బస్సులోనే కాన్పు చేశారు. ఏడో నెలలోనే బాబు పుట్టి అతనికి సీరియస్ గా ఉండటంతో సూర్యాపేట ఏరియా వైద్యులకు సమాచారం అందించి అక్కడి నుంచి 108 వాహనంలో సూర్యాపేటలో తరలిస్తుండగా మార్గమధ్యలో వైద్యులు చేరుకొని పుట్టిన బాబుకు సిపిఆర్ ఇతర పరీక్షలు చేస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లి రక్షించారు. సమయానికి అక్కడికి చేరుకొని కాన్పు చేసి వైద్య పరీక్షలు చేస్తూ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించి తల్లి,బాబును రక్షించిన 108 సిబ్బందిని సూర్యాపేట వైద్యులు, అలివేలు కుటుంబ సభ్యులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *